రాజధాని రైతులకు వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలి : జనసేన మురళి

రాజధాని రైతులకు వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలి : జనసేన మురళి

         రాజధాని రైతులకు వార్షిక కౌలు తక్షణమే అందించాలని జనసేన పార్టీ నాయకులు జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆఫీస్ లో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన రైతులకు వార్షిక చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదు. ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకు ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలి ఒప్పందంలోని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా ఇచ్చింది వరుసగా రెండో ఏడాది కూడా కౌలు చెల్లింపు లో జాప్యం చేస్తూ ఆ సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనకి రైతాంగాన్ని నెట్టేసింది. 28 వేల మందికి పైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారు. వీరికి ఈ ఏడాది 189.7 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది ప్రతి ఏటా మెట్టకి మూడు వేల రూపాయలు 5,000 రూపాయలు పెంచాల్సి ఉంది. సి, ఆర్, డి, ఏ రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలి కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించాలని రైతులు అధికారులను కోరారు జనసేన పార్టీ కూడా రైతులకు సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జూన్ 21వ తేదీన కౌలు విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీచేసిన ఏ రైతు ఖాతాలలోకి కౌలు మొత్తం రాలేదు. ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటిన సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుంది. తమ ప్రాంతంలో రాజధాని నిలుపుకోవడం కోసం 250 రోజులకు పై బడి రైతులు పోరాటం చేస్తున్నారు. ఆ రైతులకు న్యాయం చేయాల్సిన తరుణంలో వార్షిక కౌలు కూడా చెల్లించకుండా జాప్యం చేయడం ఒప్పందం ఉల్లంఘనే అవుతుంది. తక్షణమే రైతులకు రావాల్సిన డబ్బులు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలి అని మురళీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొర్రపాటి గోపీచంద్, రామారావు, సాయి కిరణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

See also  మే డే సందర్భంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి