యూ – 19 క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లిన ఆంధ్రా జట్టు

– రాజస్థాన్ పై 27 పరుగుల తేడాతో అద్భుత విజయం
కోల్ కతా, నవంబర్ 6 (జనస్వరం ప్రత్యేక ప్రతినిధి) : స్థానిక ఆదిత్య అకాడమీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన యూ – 19 మ్యాచ్లో ఆంధ్ర జట్టు అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ పై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆంధ్రా జట్టు టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్రా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అంజుమ్ (38), సేతు సాయి వి (26) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు ఆంధ్రా బౌలర్ల ధాటికి తట్టుకోలేక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ జషా మెహక్ అద్భుత ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్ లో నాటౌట్ గా నిలిచి, బౌలింగ్లో 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. ఆమెకు ‘ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. జట్టు మేనేజర్ మౌనిక జషా ప్రదర్శన ను, అలాగే మొత్తం జట్టు కృషిని అభినందిస్తూ, రాబోయే మ్యాచ్ లోనూ ఇలాగే ప్రతిభ కనబరచాలని సూచించారు.

See also  కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్‌!.. మరోసారి అలా చేయొద్దంటూ మందలింపు