అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన అనపర్తి జనసేన నాయకులు

అనపర్తి

           అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం మామిడాడ గ్రామంలో అంబేద్కర్ కాలనీ ఎస్సీ పేటలో అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 7నెల గర్భిణి స్త్రీ మరియు 70సం, వృద్ధురాలి మరియు కుటుంబం ఒక చిన్న గుడిసెలో అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. దురదృష్టవశాత్తు వృద్ధురాలు మరణించి పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. పూర్తిగా దగ్ధం అయిన ఇల్లు కట్టుబట్టలతో మాత్రమే మిగిలి వున్న ఆ కుటుంబానికి విషయం తెలుసుకున్న జనసైనికులు అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఆయన ఆదేశాలు మేరకు వారిని పరామర్శించి అనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు రూ. 10.000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడాడ గ్రామ జనసేన అధ్యక్షుడు కళ్యాణ్ గారు అశోక్, సుంకర బుజ్జి, వడ్లమూరి గోవిందరాజులు, కొండబాబు, జన సైనికులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారి కృష్ణ జిల్లా పర్యటన ప్రమాదంలో గాయపడిన జనసైనికులకు రూ. 1,60,000 ఆర్థిక సహాయం