మడకశిర నియోజకవర్గంలో పర్యటించిన అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు

   మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మడకశిర నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్ పర్యటించడం జరిగింది. మడకశిర పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్, జనసేన నాయకులు పూలమాలలు వేసి అనంతరం అంబేద్కర్ సర్కిల్ నుండి వైయస్సార్ సర్కిల్ మీదుగా పెనుగొండ రోడ్డు జిమ్ సెంటర్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీ టి.సి.వరుణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఇప్పటికీ హంద్రీనీవా కాలువ పూర్తికాక రొల్ల, అగిలి, చెరువులకు నీరు చేరలేదని నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు చేయాలని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ప్రాంతం నుండి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ నియోజక అభివృద్ధి మాత్రం శూన్యం అని తెలిపారు. అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా వెనుకబడిన ప్రాంతం మడకశిర అని తెలియజేసారు. అంతే కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి మోసపోయారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బెదిరిస్తే భయపడేది లేదని రోడ్డులోకి వచ్చి గట్టిగా సమాధానం ఇస్తామని వైకాపా పార్టీని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కే.నాగేంద్ర, జిల్లా కార్యదర్శిలు కిరణ్ కుమార్, సిద్దు, సంయుక్త కార్యదర్శి ఆనంద్ కృష్ణ, మడకశిర నియోజకవర్గ మండల అధ్యక్షులు T.A శివాజీ. రొల్ల మండల రంగస్వామి, అగిలి మండలం భాను ప్రకాష్, గుడిబండ మండలం మంజునాథ్, మండల కమిటీ సభ్యులు నియోజకవర్గంలో ఉన్న జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.

See also  ఇది ప్రజాస్వామ్యమా జగన్ రెడ్డి జాగీరా : జనసేన నాయకులు భూపతి మురళి మోహన్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి