టీడీపీ, వైసీపీ దొందూ దొందే ప్రజల దృష్టి మరల్చేందుకే దీక్షల పర్వం : అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి

జగన్ మోహన్ రెడ్డి

     అనంతపురం, (జనస్వరం) :  అధికార వైకాపా పార్టీ, ప్రతిపక్ష తెదేపా పార్టీ రెండు దొందూదొందే అని… ప్రజల దృష్టి మరల్చేందుకే వారు దీక్షల పర్వానికి తెర తీశారని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరాం రెడ్డి విమర్శించారు. టిడిపి వైసిపి పార్టీలు మీ దొంగ నాటకాలు ఇంకా చాలించి రాష్ట్ర ప్రజల కోసం పని చేయాలని… రాష్ట్రం విడిపోయి నాటి నుంచి నేటి వరకు 2014 నుంచి 19 వరకు టిడిపి 2019 నుంచి నేటి వరకు వై ఎస్‌ ఆర్‌ సి పి దాదాపు 5 లక్షల కోట్ల అప్పులు చేసినా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. వైఎస్‌ఆర్సిపి తమ అసమర్థత పాలన కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీల పైన దాడులు చేస్తోందని.” టిడిపి తన ఉనికి కోసం చంద్రబాబు నాయుడు తన అనుచరులు చేత ఇప్పించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఇన్ని రోజులు ఈ రెండు పార్టీలను ఎన్నుకొని తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని,  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌  గారితోనే మార్పు సాధ్యమవుతుందన్నారు.

See also  ప్రభుత్వ కార్యాలయాలకు ఆసుపత్రి భవనాలను కేటాయిస్తే ఉద్యమం తప్పదు : కిరణ్ రాయల్