అనాథ శరణాలయాన్ని సందర్శించిన అనా కొణిదెల

   న్యూస్ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సతీమణి అనా కొణిదెల నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ నారపల్లి ప్రాంతంలోని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథ శరణాలయాన్ని సందర్శించారు. అక్కడి అనాథ బాలబాలికలతో ముచ్చటించి కేక్ కట్ చేశారు. వారి చదువుల గురించి తెలుసుకున్నారు. అయిదుగురు బాలికల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉందని తెలుసుకొని ఆ మొత్తాన్ని అనా కొణిదెల గారు అందించారు. అలాగే శరణాలయానికి కావలసిన నిత్యావసర సరకులు, బాలలకు అవసరమైన సామగ్రిని అందించారు.

See also  అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే జనసేన - టిడిపి పార్టీలను ఆశీర్వదించండి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి