మాదిగ ప్రజలపై దాడి చేసిన వాళ్లపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

– జౌలా (బి) గ్రామంలో ఇంకా  కొనసాగుతున్న కుల వివక్ష

– తక్కవ జాతి అని విమర్శ చేసిన  నిందితులపై SC, ST, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

భైంసా, జనవరి 17 (జనస్వరం) : జోలా (బి) గ్రామంలో మాదిగ ప్రజలపై దాడి జరిగి, గ్రామంలో కొనసాగుతున్న కుల వివక్షపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గడేకర్ సందీప్, అవినాష్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన సుభాస్, లోకేష్, మన్మధ్, రాజు కలసి వారిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయపడిన వారు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం భైంసా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్సకు వెళ్లారు. వివరాల ప్రకారం, గడేకర్ సందీప్, అవినాష్ సుభాస్ ఇళ్లు నిర్మాణం కోసం పెయింట్ పనులు చేయడానికి 20 వేల రూపాయల ఒప్పందం చేసుకున్నారు. పనులు పూర్తయిన తర్వాత, మిగిలిన డబ్బులు ఇవ్వాలని గడేకర్, అవినాష్ అడిగినప్పుడు, సుభాస్, లోకేష్, మన్మధ్, రాజు కలసి విరోధంతో దాడి చేశారు. దాడిలో మాదిగ ప్రజలపై తక్కువ జాతి కామెంట్లు చేసి, ప్రవర్తనలో కుల వివక్షను ప్రదర్శించినట్లు బాధితులు తెలిపారు. భైంసా స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు, ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చైతన్యం కల్పించాలని కోరారు.

See also  భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాలకుర్తి జనసేన నాయకులు