జనసేన పార్టీలోకి చేరిన అంభేరుపురం YSRCP నాయకులు

అంభేరుపురం

    అంభేరుపురం, (జనస్వరం) :  చోడవరం నియోజకవర్గం అంభేరుపురం గ్రామానికి  చెందిన శ్రీ శరగడం రామకృష్ణ గారు గత 15 సంవత్సరములనుండి క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ YSR కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. గత పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప వోట్ల తేడాతో ఓటమిచెందారు. అయినప్పటికీ ఎటువంటి నిరాస చెందక ప్రజాసేవలో పూర్తిగా ఉంటూ మండల చోడవరంమండల YSR పార్టీ ఉపాధ్యక్షులుగా ఉంటూ వచ్చారు. ప్రజలకు సేవ చెయ్యాలనే తన ఆశలకు YSR  పార్టీ లో తీవ్ర ప్రతిభందకాలు ఎదురుకావడంతో, స్థానిక రాజకీయ పరిస్థితుల్లో ఇమడలేక, విలువలుతో కూడిన రాజకీయాల కోసం జనసేన పార్టీ పై నమ్మకంతో ,పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌గారి పై గల అమితమయిన అభిమానంతో, చోడవరం నియోజకవర్గ  ఇంఛార్జ్  శ్రీ PVSN రాజు గారి ఆధ్వర్యంలో, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కన్వీనర్‌, పార్టీ సీనియర్‌ నాయకులు, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ సుందరపు విజయకుమార్‌ గారి సమక్షంలో  జనసేనపార్టీలోకి చేరడం జరిగింది. శ్రీ శరగడం రామకృష్ణ గారు చేరికతో పార్టీ కి మరింత బలం చేకూరింది. పార్టీ నుండి వీరికి అన్నిరకములుగా అండదండలు ఉంటాయని తెలియ చేస్తూ వీరికి జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము అని అన్నారు. వీరితో పాటు సిమ్మిటి గణేష్‌, కాపారపు మధు, వేగి శివ, పైలా సురేష్‌ (బుల్లి ), కంట౦ పైడిరాజు, బంగారి చంద్రరావు, కనిశేట్టి సాయి పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమములో చోడవరం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ సిరిపురపు రమేష్‌ గారు, చోడవరం టౌన్‌ పార్టీ ప్రెసిడెంట్‌ శ్రీ గూనూరు మూలు నాయుడు గారు, పార్టీ నాయకులు శ్రీ కర్రి రమేష్‌, పీల మహేష్‌, ఆడారి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

See also  ఆగిపోయే స్థితిలో ఉన్న పేద కుటుంబ పెళ్ళికి రూ. 1,00,000 సహాయం చేసి దాంపత్య జీవితాన్ని కాపాడిన జనసేన పార్టీ వీర మహిళ విలాసిని ( నిషి రెడ్డి )

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి