పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు

● బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సదా ఆచరణీయాలు
● జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్

    పాలకుర్తి, (జనస్వరం) : సామజిక తత్వవేత్త,అణగారిన వర్గాల అభ్యున్నతికై పోరాడిన మహనీయులు అంబేద్కర్ అని జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్ అన్నారు.రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్బంగా పాలకుర్తి డివిజన్ కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మేధావి, విద్యావేత్త అంబేద్కర్ అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిమ్న జాతుల హక్కులకై పోరాడిన యోధుడని కొనియాడారు. అంబేద్కర్ ఆశయసాధనకై ప్రతి పౌరుడు పాటుపడాలని కోరారు. బహుజన వర్గాల స్వేచ్ఛ, సామానత్వం కోసం చివరివరకు పోరాడిన అంబేద్కర్ ఆశయసాధనకై జనసేన పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఆకుల సైదులు, పూజారి సాయి, రవి, అజయ్, వినయ్, భరత్, తదితరులు ఉన్నారు.

See also  SPO లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యటం బాధాకరం : జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి