తుని నియోజక వర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

   తుని, (జనస్వరం) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా తుని నియోజక వర్గ జనసేనపార్టీ నాయకులు జనసేన శివ, ఉప్పలపాటి సీతారామరాజు ఆధ్వర్యంలో గొల్లఅప్పారావు సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు స్మరించుకుని గొల్ల అప్పారావు సెంటర్లో మరియు విరావరపు పేటలో ఎండలో ప్రయాణిస్తున్న ప్రజలకు మజ్జిగ పంచారు. ఈ కార్యక్రమంలో చొడిసెట్టీ గణేష్, బోనం చినబాబు, జిల్లా కార్యదర్శలు, మండల అధ్యక్షులు, NRI మునికుమార్, గోగు రాంబాబు, చోడిసెట్టీ భాస్కర్, నల్లమాట్టి రాము, ఇండుగపల్లి శ్రీను, వాడపల్లి రాము, కొజ్జువరపు ఆనంద్ బాబు, సలాది ఉదయభాస్కర్, జనసేన నాయకులు, జనసైనికులు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

See also  పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలభిషేకం చేసిన దళిత వర్గ నాయకులు