మధిర నియోజకవర్గ విద్యార్ధి విభాగము ఆధ్వర్యంలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు

    మధిర, (జనస్వరం) : మధిర నియోజకవర్గంలో జనసేన పార్టీ మధిర నియోజకవర్గ విద్యార్ధి విభాగ నాయకులు వేముల వినయ్ కుమార్ గారి నాయకత్వంలో డాక్టర్ బి . ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణాగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరియు సమాసమజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డ, బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాల ప్రకారం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీని స్థాపించి ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఆ మహానీయుల ఆశయాల అనుగుణంగా జీరో పాలిటిక్స్ తీసుకొచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ బడుగు బలహీన బహుజనులకు కులమతాలకు అతీతంగా పార్టీని ముందుకు తిసుకెళ్తున్న మహానుభావుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే రాజ్యాంగం నిర్మించి భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అండగా నిలబడిన చట్టాల ప్రకారంగా పార్టీ నడిపిస్తూరు అని అన్నారు. ఆ మహనీయులు జయంతి సందర్భంగా బోనకల్ మండల కేంద్రంలో పూల మాలలు వేసి వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేయటం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనటం జరిగింది.

See also  కోట్ల రూపాయల దోపిడీకి స్థాయి సంఘం ప్లాన్‌ : జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌