జనసేన కార్యకర్తలందరు పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి : అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్

   అనంతపురం అర్బన్, (జనస్వరం) ; జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోరుతూ 500 రూపాయలకే 5,00,000-/-లక్షల ప్రమాద భీమా, ప్రమాదవశాత్తు వైద్యశాలలో చేరితే 50,000-/-రూపాయలు వరకు వచ్చేటట్టు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ తమ కార్యకర్తల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి జనసేన కార్యకర్త ఉపయోగించుకోవాలని ముఖ్యంగా యువకులు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని నాయకులకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. నాగేంద్ర, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

See also  మన్యం జిల్లాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు నిర్వహించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి