ఆపదలో అండగా ఆదిత్య మెడికవర్ ఎం డి డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్,డాక్టర్ అమూల్య దంపతుల మానవత్వం

ఆపదలో అండగా ఆదిత్య మెడికవర్ ఎండీ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ & డాక్టర్ అమూల్య మానవత్వo.

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ₹2.5 లక్షల సహాయం.

భార్యకు అర్హతకు తగ్గ ఉద్యోగం ఇవ్వనున్నట్లు హామీ

గుంటూరు,డిసెంబర్ 12.(జనస్వరం)

వైద్య రంగంలో సేవలతో పాటు మానవతా విలువలను నిలబెట్టే వ్యక్తిగా ప్రసిద్ధి గాంచిన ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్‌, ప్రముఖ ఎముకలు–కీళ్ల వ్యాధుల నిపుణులు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గత రెండేళ్లుగా అదే ఆసుపత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా నిబద్ధతతో పనిచేసిన రాధారపు నరేంద్రబాబు ఇటీవలి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కుంగతీసింది.ఈ ఘటన తెలుసుకున్న డాక్టర్ కృష్ణ శ్రవంత్ శుక్రవారం నరేంద్ర బాబు కుటుంబాన్ని పరామర్శించి వారికి రెండున్నర లక్షల చెక్ ను అందించారు.ఆ కుటుంబానికి ఆపత్కాలంలో అండగా నిలిచి, మానవతా హృదయం ఎలాంటిదో చూపించారు. వారికి తక్షణ ఉపశమనం కల్పించేందుకు ₹2.5 లక్షల ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ శ్రవంత్, నరేంద్రబాబు భార్యను వ్యక్తిగతంగా ధైర్యపరచి, ఆమె అర్హతలకు అనుగుణంగా ఆదిత్య మెడికవర్ హాస్పిటల్‌లో ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం కుటుంబానికి తిరిగి నిలబడే బలం, భవిష్యత్తుపై నమ్మకం ఇచ్చిందని హాస్పిటల్ సిబ్బంది పేర్కొన్నారు.తన సంస్థలో పనిచేసిన ఉద్యోగుల పట్ల బాధ్యత, వారి కుటుంబాల పట్ల చూపిన అనుబంధం, ఆపదలో అండగా నిలిచే హృదయం—ఇవి అన్ని డాక్టర్ కృష్ణ శ్రవంత్ వ్యక్తిత్వానికే అద్దం పడుతున్నాయి. ఆయన చర్య నరేంద్రబాబు కుటుంబానికి ఆశ అవ్వడమే కాకుండా, సమాజానికి సానుభూతి–సేవల విలువలను చాటి చెప్పే గొప్ప సందేశంగా నిలుస్తోందని పలువురు వైద్య వర్గాలు పేర్కొంటున్నారు.ఉద్యోగుల సంక్షేమం, మానవీయ విలువల పరిరక్షణలో ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకుంది. వైద్య రంగంలో ఇలాంటి మానుషత్వం అరుదుకు చేరిన ఈ కాలంలో, డాక్టర్ శ్రవంత్ హృదయపూర్వక నిర్ణయం అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో ఆదిత్య మెడికవర్ హాస్పిటల్స్ ఎండి ప్రముఖ న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ అమూల్య ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

See also  ప్రజలకు దాహార్తి తీర్చుటకు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆర్య వైశ్య చలివేంద్ర సంఘం అధ్యక్షుడు బచ్చు కొండలు.