
ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు అరుంధతీయ పాలెంకు చెందిన పలువురు యువకులు ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయంలో, నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యములో జనసేన పార్టీలోకి చేరారు. అనంతరం వీరందరికీ జనసేన పార్టీ కండువాను కప్పి, అందరినీ జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల గళమెత్తడంలోను, ప్రజల తరఫున పోరాటం చేయడంలోనూ జనసేన పార్టీ ఎల్లవేళలా ముందు ఉంటుందని తెలిపారు. మున్ముందు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేముల సురేంద్ర, ఆత్మకూరు శ్రీకాంత్, గడ్డం వంశీ, కొండా గణేష్, పశుపర్తి కృష్ణ, కసుమూరు అనిల్, శ్యాగలమూరి నరసింహలు, శ్యాగలమూరి చంద్ర, శ్యాగలమూరి సుదర్శన్, వడుగు చంద్ర తదితరులు జనసేన పార్టీలో చేరారు.








