జనసైనికునికి అండగా క్రియాశీలక సభ్యత్వం : ఎమ్మిగనూర్ ఇంచార్జ్ రేఖా గౌడ్

జనసైనికునికి అండగా క్రియాశీలక సభ్యత్వం : ఎమ్మిగనూర్ ఇంచార్జ్ రేఖా గౌడ్

                      జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త తీసుకోవాలని పార్టీ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు, ఎమ్మిగనూరు మండలంలోని కె తిమ్మాపురం గ్రామంలో గురువారం రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు,ఈ సంధర్బంగా రేఖగౌడ్ మాట్లాడుతూ ప్రతి జనసైనికుని కుటుంబానికి నష్టం జరిగిన కష్ట కాలంలో అండగా నిలిచేందుకు సభ్యత్వం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సభ్యత్వం చేయించుకున్న ప్రతి కార్యకర్తకు 50 వేలు ప్రమాద భీమా 5 లక్షల ఇన్సూరెన్సు పార్టీ కల్పిస్తుందని ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ఏకైక పార్టీ జనసేన అన్నారు. సభ్యత్వాల నమోదు ప్రక్రియ ఆదివారం రోజు ముగుస్తుందని ఇప్పటివరకు సభ్యత్వాలు తీసుకొని ముఖ్య కార్యకర్తలు ముందుకు రావాలని తెలిపారు. పార్టీల అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించే ఈరోజుల్లో కార్యకర్తల కుటుంబాల క్షేమం గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేనపార్టీ మాత్రమే అని ప్రతి కార్యకర్త గర్వాంగ చెప్పగలరని అన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను ప్రశ్నిస్తూనే ప్రజా సమస్యల సాధనకై సైనికుల్లా ఉద్యమిద్దమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గారి ఆధ్వర్యంలో 50 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరిక