జనసైనికులకు అండగా క్రియాశీలక సభ్యత్వం : ఎమ్మిగనూర్ ఇంచార్జ్ రేఖగౌడ్

జనసైనికులకు అండగా క్రియాశీలక సభ్యత్వం : ఎమ్మిగనూర్ ఇంచార్జ్ రేఖగౌడ్

                       జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త తీసుకోవాలని పార్టీ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు. గోనెగండ్ల మండలంలోని అల్వాల గ్రామంలో మంగళవారం రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా రేఖగౌడ్ మాట్లాడుతూ ప్రతి జనసైనికుని కుటుంబానికి నష్టం జరిగిన కష్ట కాలంలో అండగా నిలిచేందుకు సభ్యత్వం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.  సభ్యత్వం చేయించుకున్న ప్రతి కార్యకర్తకు 50 వేలు ప్రమాద భీమా 5 లక్షల ఇన్సూరెన్సు పార్టీ కల్పిస్తుందని ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. సభ్యత్వాల నమోదు ప్రక్రియ ముగుస్తున్నందున సభ్యత్వాలు తీసుకొని వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తలు ముందుకు రావాలని తెలిపారు. పార్టీల అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించే ఈరోజుల్లో భిన్నంగా మిగిలిన పార్టీలు ఆలోచింపచేసేలా కార్యకర్తలు వారి కుటుంబాల క్షేమం కోరుతూ ప్రతి క్రియాశీలక కార్యకర్తలకు ఇన్సూరెన్సు అవకాశం కల్పిస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేనపార్టీ మాత్రమే అని ప్రతి కార్యకర్త గర్వ౦గా చెప్పగలరని అన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను ప్రశ్నిస్తూనే ప్రజా సమస్యల సాధనకై సైనికుల్లా ఉద్యమించేందుకు గ్రామాలలో ఉన్న అభిమానులు కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మీడియా ఇంచార్జి గానిగ బాషా, మండల ప్రధాన కార్యదర్శి రామంజి నేయులు, ఖాసీం, భాస్కర్, జనార్దన్, అల్వాల గ్రామ కార్యకర్తలు షేట్ రషీద్ వీరన్న నాగరాజు మహమ్మద్, ఎస్పీ, శ్రీనివాసులు, నరసింహులు, ప్రతాప్, పాల్గొన్నారు. 

See also  జగ్గయ్యపేట నియోజకవర్గ లోతట్టు గ్రామ ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :