మరుగుదొడ్ల కుంభకోణం పై చర్యలు తీసుకోవాలి : ఎస్ కోట నియోజకవర్గ జనసేన నాయకులు

మరుగుదొడ్ల కుంభకోణం పై చర్యలు తీసుకోవాలి : ఎస్ కోట నియోజకవర్గ జనసేన నాయకులు

      విజయనగరం జిల్లా, లక్కవరపు కోట మండలం, రేగ గ్రామంలో మరుగు దొడ్లు కుంభకోణం జరిగిందని, నిర్మాణాలు చేయకుండా బిల్లులు పెట్టి ఆ డబ్బులు వాడుకున్నారు. మరుగు దొడ్లు కట్టినవాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, మరుగుదొడ్లు కట్టని వాళ్ళకి బిల్లులు ఇస్తున్నారని మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ కుంభ కోణంలో బాధ్యులు అయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని,  వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలనీ అలాగే పాడైపోయిన పైపులు తీసి కొత్తవి వేయాలని చెప్పడం జరిగింది. మరియు పంచాయితీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది ఆఫీస్ టైం కి వచ్చి వెళ్లాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. మురుగు కాలువలు పూడిక తీయాలని వరసాలకి నీరు ఇళ్లల్లోకి వచ్చేస్తుంది అని వాపోయారు. చెరువులో చేపలు అనధికారకంగా దోచుకుంటున్నారని, కావున  వేలం పెట్టి ఆ డబ్బులు పంచాయితీ ఖర్చులకు గ్రామా అభివృద్ధికి వాడాలని  సూచించారు. గ్రామం అంత పరిశుభ్రం చేయాలనీ శానిటైజర్ చేయించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ కోట నియోజకవర్గం ఇంచార్జి ఒబ్బిన సన్యాసినాయుడు, మండల అధ్యక్షులు రావాడ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆర్ రెహమాన్,  జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు. 

See also  అంబేద్కర్ విగ్రహం దగ్గర గోరంట్ల జనసేన నాయకులు మౌన పోరాటం