మొక్కపాడు గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

మొక్కపాడు

          సత్తెనపల్లి ( జనస్వరం ) : రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, రాజుపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట.నరసయ్య వెళ్లి గ్రామ పెద్దలను కలిసి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను, జనసేనపార్టీ సిద్దాంతాలను గ్రామ పెద్దలతో చర్చించడం జరిగినది. పార్టీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషిచేసి పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరవేయాలని కోరారు. అదే విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈనెల28 వరకు జరుగుతుందని, అధిక సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం గురించి అవగాహన కల్పించి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని కోరటం జరిగినది. అదే గ్రామానికి చెందిన శివాలయం అర్చకులు బెల్లంకొండ కోటేశ్వరరావు, గుండెపోటుతో మరణించాడు. ఆ కుటుంబానికి సానుభూతితో బొర్రా అప్పారావు తన వంతు సహాయంగా 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మొక్కపాడు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు పోకల శ్రీనివాసరావు, మండలం ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, జనసేన పార్టీ, నాయకులు గాంధీ సదాశివరావు, అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మొక్కపాడు గ్రామ పెద్దలు, పోశం శ్రీనివాసరావు, పులిబండ్ల ముక్కంటి గోపి, పశ్చావుల సీతయ్య, కనడం కోటేశ్వరరావు, పోలేపల్లి నరసింహారావు, నాన బాల రమణయ్య, బిట్రగుట్ట సుబ్బారావు, 

See also  సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది