ఏలూరు నియోజకవర్గంలో కూటమి నాయకులు ఆత్మీయ సమావేశం

      ఏలూరు, మార్చి31 (జనస్వరం) : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని శాంతినగర్ 6 వ రోడ్ లో ఉన్న ఏలూరు నియోజకవర్గ పార్లమెంటు కార్యాలయంలో ఉమ్మడి పార్లమెంటు కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ ఆధ్వర్యములో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, ప.గో.జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, ఉమ్మడి ప.గో.జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు, టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

See also  పనపాకంలో వైఎస్సార్సీపీ నాయకునికి అండగా జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి