నెల్లూరులో జనసేన కార్యకర్తల ఆత్మీయ కలయిక

నెల్లూరు

       నెల్లూరు ( జనస్వరం ) : మేం విన్నాం మేమున్నాం జనసేన నెల్లూరు కార్యక్రమాన్ని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ 33 వ డివిజన్ నుండి కార్యకర్త చిన్న రాజా ఇంటి వద్ద నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ కి పనిచేస్తున్న కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల మద్దతు తో వారి ఇరువు పొరుగు వారిని కూడా ప్రభావితం చేసే విధంగా జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, స్థానిక సమస్యలపై పార్టీ తరపున నిలబడేందుకు సిద్ధం కావాలని భరోసా ఇస్తూ తమ కుటుంబ సభ్యులు ఓట్లు వేయడమే కాక చుట్టుపక్కల వారిని బందు మిత్రులను కలసి జనసేన పార్టీ కి మద్దతు కోరే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కులమతాలకతీతంగా అందరికీ సమాన హోదా కల్పించే విధంగా మన బిడ్దల భవిత కోసం పోరాడేందుకు వచ్చిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కి ఈ సారి అవకాశం ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత మనకందరికీ ఉందని తెలిపారు.స్థానిక సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఏ ఇబ్బందులు ఎదురైనా అండగా జిల్లా కమిటీ సభ్యులు తోడుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు 33 వ డివిజన్ జనసేన నాయకుడు చిన్న రాజా, 42వ డివిజన్ నాయకుడు కంతర్ భాయ్, ప్రసన్న, అమీన్, ప్రశాంత్ గౌడ్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

See also  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా..? జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి