విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక 

– మెటీరియల్ పంపిణీలో కార్యదర్శి గొర్తి వెంకట్

అనంతపురము, డిసెంబర్ 20 : విద్యార్థుల సమగ్రాభివృద్ధికి 75 రోజుల ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు పాపంపేట క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ కార్యదర్శి, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు గొర్తి వెంకటస్వామి వెల్లడించారు. ఎఫ్.ఎల్.ఎన్.శిక్షణకు సంబంధించిన ముద్రిత సామగ్రిని శనివారం పంపిణీ చేశారు. స్కూల్ కాంప్లెక్స్ ఛైర్ పర్సన్ పుల్లా లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి గొర్తి వెంకటస్వామి, సి.ఆర్.పి. వెంకటేశులు, కాంప్లెక్స్ పరిధిలోని పలువురు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి గొర్తి వెంకట్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 131 శిక్షణ కేంద్రాలకు ముద్రిత సామగ్రి సిద్ధం చేయడం సంతోషకరమన్నారు. క్లస్టర్ కాంప్లెక్స్ హెడ్‌ల ద్వారా తమ పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు ఈ ముద్రిత సామగ్రిని పంపిణీ చేశామన్నారు. ఉపాధ్యాయులు 75 రోజుల ఎఫ్.ఎల్.ఎన్. యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తారని చెప్పారు. రోజువారీ తరగతి బోధనలో తప్పనిసరిగా వినియోగించాలని వెంకట్ కోరారు. ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి, పిల్లల వాచక, గణిత నైపుణ్యాలను మెరుగుపరచాలని కోరారు. మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ముద్రిత టిఎల్ఎం సరైన వినియోగాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తారన్నారు. క్లస్టర్ సమావేశంలో నిర్ణయించిన టైమ్‌లైన్ ప్రకారం ఉపాధ్యాయులు చేత్తో టిఎల్ఎం తయారు చేశారన్నారు. ఏపీ సమగ్ర శిక్ష ద్వారా 40 శిక్షణ వీడియోలు రూపొందించడం చాలా ప్రయోజనకరమన్నారు. ముద్రిత, చేతితో తయారు చేసిన టిఎల్ఎం, 75 రోజుల ఎఫ్ఎల్ఎన్ యాక్షన్ ప్లాన్ అమలుతో

పిల్లల వాచక, గణిత నైపుణ్యాల అభివృద్ధే లక్ష్యంగా వున్నాయన్నారు.

See also  వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గౌని నాగన్న, న్యాయవాదులు