కరప మండల వ్యాప్తంగా త్రాగునీటి మంచినీటి కొరత తీర్చాలని విన్నపం

కరప

       కరప ( జనస్వరం ) : కరప మండల వ్యాప్తంగా గ్రామాలలో త్రాగునీటి సమస్య చాలా తీవ్ర స్థాయికి చేరింది. కరప మండలం కరప గ్రామ శివారు పేపకాయల పాలెం, గొర్రిపూడి, గురజనాపల్లి, ఉప్పలంక ఒంటి గ్రామాల్లో త్రాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. త్రాగునీరు పది రోజులకు ఒకసారి మాత్రమే అందుతుంది. సరైన త్రాగునీరు లేక టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు సోకి హాస్పటల్ పాలవుతున్నారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ జనసేన పార్టీ తరఫున కరప మండల ప్రజల తరఫున మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారినీ కోరడం జరిగింది.

See also  వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ యే జనసేన పార్టీ ధ్యేయం : చిలకం మధుసూదన్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి