
– రాగే రాధిక పర్యవేక్షణలో ప్రిపరేషన్ పరీక్షలు నిర్వహణ
అనంతపురం, ఏప్రిల్ 20, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపిపిఎస్సి గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శ్రీ కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మంచి అవకాశం లభించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా ప్రతి వారం టెస్ట్ ఎగ్జామ్స్ రాసుకునే సౌకర్యాన్ని కనిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురానికి చెందిన రాగే రాధిక మాట్లాడుతూ ఆదిమూర్తి నగర్‌లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో ఆఫ్‌లైన్ టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేశారని హైదరాబాద్‌కు వెళ్లలేని అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు సిద్ధం చేయడంలో అనుభవం ఉన్న సివిక్ సెంటర్ ఐఏఎస్ సంస్థ 120 రోజుల ప్రణాళికాబద్ధమైన టెస్ట్ సిరీస్ నిర్వహిస్తోందని ఇప్పటికే ఏప్రిల్ 5న నిర్వహించిన స్కాలర్షిప్ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకు టెస్ట్ సిరీస్ ఫీజులో రాయితీ కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం అడ్మిషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాల కోసం 78930 94461 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.








