
పిఠాపురం మండలం, కుమారపురం, జనవరి 4, (జనస్వరం) :
పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ఉన్న శ్రీ దేవరమ్మ తల్లి, శ్రీ మల్లమ్మ తల్లి ఆలయాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరుతో రూ.42,000 విరాళం అందజేశారు.
శ్రీ దేవరమ్మ తల్లి గుడి నూతన నిర్మాణంలో భాగంగా టైల్స్ పనుల కోసం రూ.27,000, శ్రీ మల్లమ్మ తల్లి గుడి పెయింటింగ్ పనుల కోసం రూ.15,000 విరాళాన్ని నాగం సురేంద్ర మరియు నాగం బ్రదర్స్ అందజేశారు. అలాగే పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకుపల్లి దేవి సూర్యప్రకాష్ రూ.5,000, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ రూ.2,000, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగలి అప్పారావు విరాళాలు అందజేశారు. ఈ విరాళాలను గ్రామ సర్పంచ్ నల్ల రాంబాబు గారి చేతుల మీదుగా ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధికి సహకరించిన దాతలకు గ్రామ పెద్దలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగం సురేంద్ర, బావిశెట్టి రామకృష్ణ, తాటికాయల ప్రసాద్, వేణుగోపాల్, నక్క సత్తిరాజు, తాటికాయల మణి, కర్నిడి శ్రీను, నక్కల సత్యనారాయణ, నక్కల శ్రీను, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ పెద్దలు, కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు.








