జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆదోని జనసేన నాయకులు

ఆదోని

     ఆదోని, (జనస్వరం) :  జనసేన పార్టీ అధినేత  శ్రీ  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా  కర్నూలు జిల్లా  ఆదోని పట్టణములో గర్భిణీ స్త్రీలకు, తలసేమియా పిల్లలకు ఆదోని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యములో  రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మెగా అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అదే విధంగా రామ్ చరణ్ యువశక్తి నాగేష్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా తలసేమియాతో భాదపడుతున్న పిల్లల కోసం స్వచ్చంధంగా 20 మంది రక్త దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకుడు హాజీ మరియు వారి బృందం మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్, కళ్యాణ్, చిన్న గోపాల్, వీరేశ్, హరి తదితరులు పాల్గొన్నారు.

See also  అనకాపల్లిలో మాస్కులు పంపిణీ చేసిన జనసేన నాయకుడు పరచూరి భాస్కరరావు