
అనకాపల్లిలో మాస్కులు పంపిణీ చేసిన జనసేన నాయకుడు పరచూరి భాస్కరరావు
ఇపుడు ప్రపంచం మొత్తం మానవాళి కరోనా మహమ్మారితో అనారోగ్య బారిన పడింది. ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇంతవరకూ కనగొనలేదు. కావున మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ కరోనా మహమ్మారి మన దరికి చేరకూడదు అంటే మాస్కులు మాత్రమే మనకు ఆయుధం. ఆ కరోనా లాక్ డౌన్ కాలంలో జనసైనికులు చేసిన జనసేవ కార్యక్రమాలు అభినందించదగినవి. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లిలో కోట్నీ వీధిలో ఉన్న మారిడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి.
ఈ జాతరకు వచ్చే భక్తులకు జనసేన నాయకుడు పరచూరి భాస్కరరావు గారి అధ్వర్యంలో ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. భాస్కరరావు గారు మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర సమయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన జనసేవ కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అందులో భాగంగా మారిడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులు మాస్కులు ధరించట్లేదని మా దృష్టికి రావడంతో భక్తులకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే జాతరకు వచ్చే భక్తులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమలో జనసేన నాయకుడు పరచూరి భాస్కరరావు గారు మరియు ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు తాకాశి సత్యం దొర, భర్నికానరాము, బుద్ధ రామదాసు, అప్పికొండ గణేష్, నాగు, కోట్నీ సూరిబాబు, యేసు నాయుడు తదితర జనసైనికులు పాల్గొన్నారు.









