కరోనా కష్టకాలంలో జనసేన వీరమహిళ దుర్గ చేస్తున్నసేవలను అభినందిస్తున్న ప్రజానీకం

జనసేన

             రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం పొదలాడ గ్రామానికి చెందిన పంచదార కళ్లు దుర్గ (జనసేన వీర మహిళ) తయారు చేసిన మాస్కులను పోలీసులకు, ఆశా వర్కర్లకు, అనాధలకు, పేదలకు కుట్టించి ప్రతి ఒక్కరికి మాస్కులు ఉచితంగా ఇవ్వడం వీరి దాతృత్వం. లాక్‌ డౌన్ సమయంలో ఎవరికైనా భోజనం కావాలంటే కరోనా బారిన పడ్డ కుటుంబం ఇంటికి వెళ్లి సొంతంగా తయారు చేసిన భోజనాన్ని పంపిణీ చేయడం పట్ల పలువురు వీరిని అభినందిస్తున్నారు. భర్త పొదలాడ చినబాబు సహాయంతో పలు సేవా కార్యక్రమాలు చేయడం పట్ల మలిపురం ఎస్‌ఐ నాగరాజు, రాజోలు సీఐ ద్వారపూడి దుర్గ శేఖర్‌ రెడ్డి పలువురు పోలీసులు ఆశా వర్కర్లు వీరు చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

See also  తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నాకు అండగా జనసేన నాయకులు, వీర మహిళలు