పులిచింతల ప్రాజెక్ట్ ఘటనపై స్పందించిన కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్

పులిచింతల

    జగ్గయ్యపేట, (జనస్వరం) :  కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో గల పులిచింతల ప్రాజెక్ట్ నందు ఎగువ నుండి వస్తున్న భారీ వరదకు తెల్ల వారుజమున 3 గం. ప్రాంతంలో భారీ వరదకు ప్రాజెక్ట్ యొక్క 16 వ గేట్ విరిగిపడిన ఘటన చోటు చేసుకుంది. మరి ఈ ఘటన కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని ఈమని కిషోర్ కుమార్ గారు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరి గత వారం పది రోజులుగా ఎగువ నుండి వస్తునటువంటి భారీ వరద కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది అని, ముందుగా అప్రమత్తం అవాల్సిన బాధ్యత ప్రాజెక్ట్ అధికారులది మరియు ప్రభుత్వంపై ఉన్నదని, ఆ విషయంలో పూర్తిగా విఫలం అయ్యారని ఆయన తెలియచేశారు. ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ పాలకుల అసమర్థత మూలంగా, ఇంజినీర్ల మూలంగా నాణ్యత లేని నిర్మాణం జరిగిందని, దాని మూలంగా నేడు ఈ ఘటన చోటుచేసుకుందని, దిగువన ఉన్న గ్రామ ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఉండాల్సిన అవసరం వచ్చిందని అని అన్నారు. మా జనసేన  అధ్యక్షుల వారు అందుకే సమాజంలో ముందు చూపు ఉన్న వ్యవస్థ అవసరమని అంటారని ఆయన తెలియచేసారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కొన్ని ముందస్తు చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాలు అయినటువంటి వేదాద్రి, ముక్త్యాల, రావిరాల గ్రామాలకు గత సంవత్సరం లాగా కాకుండా ముందుగానే తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని మేము  కోరుకుతున్నాము అని తెలియచేసారు.

See also  సోము వీర్రాజు గారిని మర్యాద పూర్వకంగా కలసిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి