నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ టవర్‌ నిర్మించవద్దు : జనసేన నాయకులు ఆకుల రమేశ్

జనసేన

             నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల సమీపంలో సెల్‌ టవర్‌ నిర్మించవద్దని జనసేన పార్టీ లీగల్‌ సెల్‌ నాయకులు అనుకుల రమేష్‌ ప్రభుత్వాన్ని కోరారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో పాఠశాల సమీపంలో అక్రమంగా సెల్‌ టవర్‌ నిర్మిస్తున్నారన్నారు. దీనివల్ల, విద్యార్థులు రేడియేషన్‌కు గురై ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి నిలిపివేయాలని కోరారు. తణుకు తహసీల్దార్‌ పీఎన్‌డి ప్రసాద్‌, ఎంపీడీవో సూర్యనారాయణ మూర్తికి ఫిర్యాదులతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. తొంట సత్యన్నారాయణ, పంచాయతీ మెంబర్స్‌ కొయ్యల విజయ్‌, శ్రీరాములు చిన్నికేదారి రాము తదితరులు పాల్గొన్నారు.

See also  పలువురు యువకులు కదిరి జనసేన పార్టీలో చేరిక