ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ రేఖ గౌడ్, ఆదేశాల మేరకు స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు నిరుద్యోగుల సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకు ఎలాంటి మేలు జరగడం లేదని ఎన్నికల సమయంలో పోస్టులు భర్తీ చేస్తామని హామీ చూపించి నిరుద్యోగులు కేవలం ఓటర్లుగానే ఈ ప్రభుత్వం చూస్తోందని, ఈవైఖరి మార్చుకోవాలని పెండింగ్లో ఉన్న రెండు లక్షల ముప్పై నాలుగు పైచిలుకు ప్రభుత్వ పోస్టులు భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేని తరుణంలో నిరుద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా ఒక కొత్త జీవో ని విడుదల చేసి ఆర్థికంగా నిరుద్యోగుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులకు అండగా జనసేన పార్టీ తరుపున పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, రవి ప్రకాష్, షబ్బీర్, వినయ్,వెంకటేష్, ఉరుకుందు, మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.