నిరుద్యోగులను నిండా ముంచిన వైసీపీ ప్రభుత్వం : బొబ్బిలి జనసేన నాయకులు, వీర మహిళలు

వైసీపీ

              విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జ్యాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను నిలువునా ముంచేటట్లు ఉందని జనసేన నాయకులు, వీరమహిళలు ఖండించారు. నిరుద్యోగులకు అండగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తక్షణమే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి ఒక్కరునీ ఆదుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏ.పి.పి.ఎస్. సి ద్వారా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధికారంలోకి రాగానే రెండేళ్ల తర్వాత మాట మార్చి మడమ తిప్పింది జాబ్ క్యాలెండరు కోసం పలు ముహుర్తాలు మార్చి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు ప్రతి యేటా జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ అని ఎన్నో తేదీలు మార్చారు చివరకు తూ.. తూ మంత్రం గా క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు. 

See also  శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించండి : జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశములో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి