కర్ణాటక రాష్ట్రoలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించిన జనసైనికులు

కర్ణాటక

        కర్ణాటక రాష్ట్రములో చింతామణిలో వార్డ్ నెం21 మరియు జె జె కాలనీలో 120 పేద కుటుంబాలకు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర పరిస్థితులో దినసరి కూలీలు ఆకలితో అలమటిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన జనసేవ స్పూర్తితో మా సేవలు కొనసాగిస్తున్నాము అని అన్నారు. భవిష్యత్తులో జనసేన పార్టీ తరుపున సహాయ కార్యక్రమాలు చేస్తాము అన్నారు. రాష్ట్రము వేరైనా  శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చాయని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమములో చింతామణి మెగా ఫ్యాన్స్ అసోసియేషన్, జనసేన నాయకులు సి. వి. నాగరాజ్, అమర్, వినయ్, శ్రీనివాస్ గౌడ్, రెడ్డి, జాలారీ శ్రీనివాస్, రెడ్డి ప్రసాద్, విజేతనరేష్. సి. విరమేష్, సురేష్ పూజారి వెంకటరవణ, శేఖర్ బాబు, కాళీ బాబు, మణికంఠ కేసర్ల్, సి.ఎం, సునీల్, షాబుద్దీన్  తదితరులు  పాల్గొన్నారు.

See also  శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాలలో పర్యటించిన అనంతపురం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి