
మంత్రి శంకర్ నారాయణ పై ధ్వజమెత్తిన కదిరి జనసేన ఇంఛార్జ్ భైరవ్ ప్రసాద్
రోడ్ల భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ గారు మాట్లాడుతూ జనసేన పార్టీని అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడాన్ని కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ గారు తీవ్రంగా తప్పు పట్టారు. మంత్రిగా మీరు గత 15 నెలల కాలం నుంచి అనంతపురం జిల్లాకు గాని అలాగే మీ సొంత నియోజకవర్గం పెనుగొండకు గాని ఎంత అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని, అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత స్థాయి నీకు లేదని చెప్పి తెలియజేశారు. మీరు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ తీసుకున్నారని అలాగే ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం అని చెప్పి చెప్పడాన్ని ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి అధికార పదవి లేకపోయినా తన పార్టీ కార్యకర్తల ద్వారా గత నాలుగు నెలల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని మీరు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ ప్రజలకు సేవ చేసింది శూన్యం అని చెప్పి తెలియజేశారు. గత నాలుగు నెలల నుంచి కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే జిల్లాలో ఏ రోజు కూడా మీరు ఆరోగ్య పరిస్థితులపై రివ్యూ మీటింగ్ పెట్టింది లేదని అలాగే జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొనలేదని చెప్పి తెలియజేశారు. మీరు గత 15 నెలల కాలం నుంచి ఈ జిల్లాకు కు ఎన్ని బీసీ కార్పొరేషన్ లోన్లు ఇప్పించారు ఎన్ని నామినేటెడ్ పదవులు బీసీలకు ఇప్పించారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కదిరి జనసేన పార్టీ తరపున కోరుతున్నాం. అలాగే అమరావతి రైతులకు టిడిపి ,వైసిపి పార్టీలు రెండు ద్రోహం చేశాయని ఆరోజు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలను సేకరించారు . ఈరోజు మీరు అమరావతి రాజధానిని తరలిస్తే ప్రభుత్వానికి ఇచ్చిన ఆ రైతులకు ఏం సమాధానం చెప్తారు? మీరు జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టండి కానీ పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పార్టీ పైన విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరించారు.








