రాకపోకలకు అంతరాయం కలిగిన ఫ్లై ఓవర్ పై దృష్టి సారించాలని కోరుతున్న జనసైనికులు

రాకపోకలకు అంతరాయం కలిగిన ఫ్లై ఓవర్ పై దృష్టి సారించాలని కోరుతున్న జనసైనికులు

     జగ్గయ్యపేట నియోజకవర్గంలో చిల్లకల్లు గ్రామంలో వేసినటువంటి ఫ్లై ఓవర్ అనేది అనుమతిలేనప్పటికీ అక్కడ ఇబ్రాహీంపట్నంలో మాదిరిగా రింగ్ రోడ్ వేయాల్సినటువంటి డిజైన్ ని మరీ గత ప్రభుత్వాల మరియు నాయకుల సొంత స్వలాభ౦ కోసం అక్కడ ఫ్లైఓవర్ వేయటం జరిగింది. మరీ ఫ్లైఓవర్ అనేది వేసినప్పటికీ కేవలం రాకపోకలకు ఒకటే దారి ఏర్పాటు చేయటంతో ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున ఫ్లైఓవర్ మార్గాన్ని సందర్శించి స్పందించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాలలో నియిజకవర్గంలోనే చిల్లకల్లు గ్రామం ఉంటది. అక్కడ వేయాల్సినటువంటి రింగ్ రోడ్ మార్గాన్ని ఫ్లైఓవర్ గా మార్చి కేవలం రాకపోకలకు ఒకటే దారి పెట్టి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుందని, చూసుకునట్లయితే జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్లాలన్నా లేదా వైరా వెళ్లాలన్నా ఇదే మార్గం గుండా వెళాల్సిన పరిస్థితి అని, అదే విధంగా పెనుగంచిప్రోలు, వైరా మీదుగా వచ్చే వాహనాలు జగ్గయ్యపేట వైపుగా వెళ్లాలన్నా వాహనాలు కూడా ఇదే  మార్గం గుండా వెళాల్సిన పరిస్థితి.  ముఖ్యంగా చూసుకునట్లు ఐతే జగ్గయ్యపేట అనేది రవాణా పరంగ ప్రసిద్ధి చెందినా పట్టణంగా ఉంది అందులో భాగంగా మద్రాస్ సిమెంట్స్ చిల్లకల్లు సమీపంలో ఉండడంతో ఎక్కువగా లారీలు అనేవి ఈ మార్గం గుండానే వెళాల్సిన పరిస్థితి ఉందని, మరీ వీటి వలన లైన్లకి ఒకటే దారి ఉండడంతో యాక్సిడెంట్స్ ఎక్కువగా కూడా అవుతున్నాయని మరీ వీటి వలన ప్రయాణికులతో పాటుగా అటు ప్రజలు వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మరీ తక్షణమే నేషనల్ హైవే అథారిటీ వారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అదే విధంగా పోలీస్ వారు పట్టుకున్న వాహనాల్ని కూడా రోడ్ కి ఇరుప్రక్కల ఉంచడంతో మరీ ఇబ్బంది అవుతుందని ప్రజలు వాపోతున్నారు. దీని గురించి కూడా పోలీస్ శాఖ వారు దృష్టి సారించాలని జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో నాగ, త్రిశాంత్, ఆసిఫ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

See also  కృష్ణా, పెన్నా ప్రాంతీయ కమీటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వీరమహిళల సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి