వెలుగోడులో హత్యాయత్నం గిరిజన మహిళను పరామర్శించిన జనసేన ఎమ్మిగనూరు ఇంచార్జ్

వెలుగోడులో హత్యాయత్నం గిరిజన మహిళను పరామర్శించిన జనసేన ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖ 

     వెలుగోడులో హత్యాయత్నం గిరిజన మహిళను పరామర్శించిన జనసేన ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై రోజు రోజూకి మానభంగ కేసులు ఎక్కువ అవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన దిశ చట్టం దశ లేకుండా మూలన పడి ఉందని అన్నారు. రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యం చేస్తున్న వారిని సరిగ్గా శిక్షించడం లేదని అన్నారు. రాష్ట్ర హోం మంత్రి ఒక మహిళగా ఉన్న రాష్ట్రంలో స్త్రీల మీద ఇంత అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు. వెలుగోడులో జరిగిన సంఘటన నిందితులను వెంటనే అరెస్టు చేసి, అత్యాచారానికి పాల్పడిన మహిళకు న్యాయం చెయ్యాలని, రేప్ కేస్ ను తారుమారు చేసి మాయ చేస్తున్న ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  అత్యాచారానికి గురైన బాధితులను పరామర్శించి, వారికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బుడ్డ శ్రీకాంత్ రెడ్డి గారు మరియు శ్రీశైలం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరాములు గారు శాలు భాషా, సిల్వరి వెంకటేష్, పురుషోత్తం  గౌడ,  వీరమహిళా రేష్మ మరియు బీజేపీ ST మొర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్ర నాయక్, OBC మొర్చ జిల్లా జెనరల్ సెక్రటరీ GV రమణ గౌడ్, వీరమహిళా రేష్మ తదితరులు పాల్గొన్నారు.

See also  మృతురాలి కుటుంబానికి డాక్టర్ కందుల చేయూత

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి