స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చినా, సిలెండర్లపై అధికారుల నిర్లక్ష్యం : రాజోలు జనసేన నాయకులు

          రాజోలు నియోజకవర్గంలో ప్రజలు కరోనా వైరస్ బారినపడి రోజురోజుకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు చనిపోతుంటే చూడలేక వారికి సేవ చేయాలని మానవతా దృక్పథంతో ఆక్సిజన్ స్వచ్ఛందంగా అందజేయడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఆ సంస్థలకు సంబంధించిన ఆక్సిజన్ సిలిండర్ ఫీలింగ్ అవ్వకుండా ఏజెన్సీ వారిని అడ్డగిస్తున్నారు. ఎందుకు అపుతున్నారు అని అడిగితే మాకు పై నుంచి ఆదేశాలు వచ్చాయి కలెక్టర్ గారి లెటర్ లేకుండా ఎటువంటి ఆక్సిజన్ సిలిండర్ ను ఫీలింగ్ చేసి ఇవ్వడం కుదరదు అని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చూసి జనసేన పార్టీ నాయకులు సబ్ కలెక్టర్ ఆఫీస్ కి కలవడానికి వెళ్తే సబ్ కలెక్టర్ గారు కలవలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సమస్యపై తక్షణం స్పందించి సరైన నిర్ణయం తీసుకోకపోతే జనసేన పార్టీ ఉద్యమిస్తుంది లేని పక్షంలో జనసేన పార్టీ ఎంత దూరం అయినా సరే వెళ్లడానికి ప్రజల పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాము అని అన్నారు. 

See also  గోరంట్ల మండలం జనసేన పార్టీ లోకి 20 కుటుంబాలు చేరిక

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి