
పవన్ కళ్యాణ్ సూచనలు పరిగణలోకి తీసుకొని జాతీయ విద్యా విధానం: జనసేన మురళి
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ గారి సూచనలు మేరకు నిర్వహించిన ఒక సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యావిధానంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతూ కేంద్ర మంత్రివర్గం నూతన విద్యా విధానం అమలులోకి తీసుకు రావడంతో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జనసేన పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2019 వ సంవత్సరం మాతృభాషను పరిరక్షించేలా నూతన విద్యా విధానం పాలసీ గురించి సూచించిన కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయడం జరిగిందని స్వయంగా కేంద్ర మంత్రి రమేష్ నిశాంక్ ఫాఖ్రియాల్ ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది అన్నారు. ఏ మీడియంలో విద్యార్థులకు పాఠాలను చదివించాలనే విషయం ఆప్షనల్ గా ఉండాలి తప్ప తప్పనిసరి చేయడం సరికాదంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందునుంచే చెబుతూ వస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కేంద్రమంత్రులకు జనసేన పార్టీ తరఫున జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త బాడిశ మురళీకృష్ణ ధన్యవాదములు తెలిపారు.








