మెగాస్టార్ చిరంజీవి అభిమానం గుర్తించడం జీవితంలో మరిచిపోలేని క్షణం

అనంతపురం, సెప్టెంబర్ 22 (జనస్వరం): మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో తాను చేస్తున్న సేవలను గుర్తించి ఆయన ఆప్యాయంగా అభినందించడం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమని మెగా యూత్ ఫోర్స్ అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఇమామ్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ తనకు కేవలం ఒక కుటుంబం కాదని, కోట్లాది అభిమానులతో అనుబంధం కలిగిన భావోద్వేగమని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి తనను ఒక సామాన్య అభిమానిగా గుర్తించి ఆప్యాయంగా పలకరించి అభినందించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఆ అభిమానం మెగా ఫ్యామిలీ కోసం మరింత సేవ చేయాలనే బాధ్యతను, ఉత్సాహాన్ని పెంచిందని తెలిపారు. అలాగే మెగా ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అభిమానులను కలుసుకోవాలనే చిరంజీవి ఆలోచన తమలాంటి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో, మెగా ఫ్యామిలీ సేవలో, అభిమానుల కోసం ఎల్లప్పుడూ ముందుంటానని ఇమామ్ హుస్సేన్ పేర్కొన్నారు.

See also  మాటలు తప్ప చేతలు లేని అసమర్ధ మంత్రి అంబటి రాంబాబు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి