మద్యం షాపుల దగ్గర కరోనా పై అవగాహన ఏర్పాటు చేసిన జనసైనికులు

మద్యం షాపుల దగ్గర కరోనా పై అవగాహన ఏర్పాటు చేసిన జనసైనికులు. 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మద్యం దుకాణాల వద్ద క్యూ లైన్లు చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు నెల్లూరు సిటీలో మద్యం దుకాణాల వద్దకు చేరుకొని రోడ్ పై సామాజిక దూరం పాటిస్తూ మార్జిన్ లైన్లు ఏర్పాటుచేసి,  దూరం పాటించమని మద్యం వినియోగదారులకు తెలియజేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున నుంచి మాట్లాడుతూ.. కరోనా ప్రారంభ  సమయం నుండి నేటి లాక్డౌన్ వరకూ ప్రజలందరూ ఎంతో సమన్వయం పాటించి ప్రధానమంత్రి మోడీ గారి సూచనలు పాటించి కొంతవరకు కట్టడి చేశారు. లాక్ డౌన్ నియమాలు సడలింపు లో భాగంగా మద్యం షాపులు అమ్మకాలను పునఃప్రారంబించటం వలన ఇన్ని  రోజులు  చేసిన నియంత్రణ ను బూడిద పాలు చేసింది. మాస్కులు  లేకపోవడం మరియు సామాజిక దూరం పాటించడం లాంటి  కనీస జాగ్రత్తలు పాటించకుండా మద్యం మత్తులో క్యూలు కట్టడం చూస్తున్నాం. ఈ పరిస్థితులను చూస్తూంటే సామాన్య మానవుడు భయాందోళనలకు గురి అవుతున్నారు. సామాన్య వ్యాపారస్తులను నియమ నిబంధనల పేరుతో కట్టడిచేస్తున్న ప్రభుత్వ అధికారులు మద్యం షాపుల పై ఈ నియమాలు ఎందుకు పాటించడం లేదు? మద్యం షాపుల ను దశల వారిగా పూర్తిగా ఎత్తివేస్తామని ప్రకటించిన ఈ ప్రభుత్వం కరోణా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం షాపులు ప్రారంభించడం మరియు రేట్లు పెంచడం తమకు ఎంతో ఇబ్బంది కరంగా ఉందని మహిళా సంఘాలు ఎన్ని మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  ఏడు దశాబ్దాల మన స్వాతంత్రం లో పాలు టీ కాఫీ దొంగతనంగా అమ్ముతున్నారు కానీ మద్యం బహిరంగంగా అమ్ముతున్నారు అని తెలియజేయడానికి చాలా సిగ్గు పడుతున్నాను. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో కరోనా మహమ్మారి విజృంభన తగ్గించే వరకు సామాన్యుడి మనుగడకు ప్రమాదకరమైన మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిపి వేయాలని, ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి గునుకుల కిషోర్, డాక్టర్ అజయ్, ప్రశాంత్ గౌడ్, సుల్తాన్ బాషా, మొయినుద్దీన్, విక్రాంత్, ప్రశాంత్, షాజహన్, సాయితేజ, బాలాజీ, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. 

See also  రోడ్డు ప్రమాదాలన్నీ జగన్ సర్కారు హత్యలే - కోన, పల్లా విమర్శ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి