బిజెపి నాయకులకు కమిటీల పటిష్ఠత పై దిశానిర్దేశం చేసిన జిల్లా ఉపాధ్యక్షుడు గోగినేని venkataramana

బీజేపీ పదాధికారుల కీలక భేటీ – కమిటీల పటిష్టతపై గోగినేని దిశానిర్దేశం

సత్తెనపల్లి, ఆగస్ట్ 09( జనస్వరం)

పట్టణంలోని తాడువాయి భవన్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షులు కందకట్ల శంకర్రావు ఆధ్వర్యంలో పట్టణ పదాధికారుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.​ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ మాట్లాడుతూ మండల కమిటీలు, మోర్చా కమిటీలు మరియు శక్తి కేంద్ర ప్రముఖుల బాధ్యతలు, కార్యాచరణపై పలు ఆచరణాత్మక సూచనలు, విలువైన సలహాలను అందించారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి మాజీ ఇంచార్జ్ కట్టా శంకర్రావుతో పాటు పట్టణ పదాధికారులు, బీజేపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  జగన్మోహనరెడ్డి గారి పాలనలో దివ్యాంగులు, మహిళలపైన దాడులు, హత్యాచారాలు : గోగన ఆదిశేషు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి