
దక్షిణ భారత మానవ హక్కుల సైనికులకు ఘనమైన ఆహ్వానం: ఆగస్టు 9న ఆంధ్రప్రదేశ్ వేదికగా HRCI 4వ వార్షికోత్సవ మహోత్సవం!
విజయవాడ,జూలై11
( జనస్వరం)
“సమాజంలో అణగారిన వర్గాల గొంతుకగా మారి, మానవ హక్కుల రక్షణే శ్వాసగా పోరాడుతున్న ప్రతి ఒక్క HRCI సభ్యుడికి వందనం.”
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి దక్షిణ భారతదేశం లోని కౌన్సిల్ సభ్యులందరికీ అత్యంత ప్రతిష్టాత్మకమైన పిలుపునిచ్చారు.రాబోయే ఆగస్టు 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ వేదికగా సంస్థ యొక్క 4వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నాము.ఈ మహోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, మనమంతా ఒకే కుటుంబంగా కలిసి, సమాజ శ్రేయస్సు కోసం మనం చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, భవిష్యత్ కార్యాచరణకు నాంది పలికే ఒక చారిత్రాత్మక సభ.
*జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ఆత్మీయ పిలుపు:*
“బాధల్లో ఉన్నవారికి అండగా నిలబడటంలో, హక్కుల రక్షణ కోసం అలుపెరగని పోరాటం చేయడంలో మీరంతా చూపుతున్న దీక్ష అసమానమైనది. దక్షిణ భారతదేశంలో HRCI జెండాను గర్వంగా ఎగురవేస్తున్న ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఈ సంస్థకు వెన్నుముక. మీ నిరంతర కృషిని గౌరవించుకోవడం,మిమ్మల్ని సముచితంగా సన్మానించుకోవడం నా బాధ్యతగా, హృదయపూర్వక కర్తవ్యంగా భావిస్తున్నాను.”
దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ) కి చెందిన:
జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న గౌరవనీయ సభ్యులు,రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు,సంస్థ యొక్క ప్రతి ఒక్క క్రియాశీల సభ్యుడు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
వేడుకల ముఖ్య ఉద్దేశం – సన్మాన సత్కారాలు,ఈ నాలుగో వార్షికోత్సవ సభలో, సమాజ సేవలో అహర్నిశలు శ్రమిస్తున్న మన నాయకులను, సభ్యులను ఘనంగా సన్మానించి, సత్కరించు కోబోతున్నాము. మీ నిబద్ధతకు ఇచ్చే ఈ గౌరవం, రాబోయే రోజుల్లో మనల్ని మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తుంది.కావున, దక్షిణ భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రతినిధి బాధ్యతగా ఈ పిలుపును స్వీకరించి, ఆగస్టు 9న ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఈ మహాసభకు తప్పనిసరిగా హాజరై, సన్మాన సత్కారాలను స్వీకరించి, కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాము.








