సత్తెనపల్లి పట్టణంలో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు

సత్తెనపల్లిలో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు

సత్తెనపల్లి,మే 31( జనస్వరం)
ప్రముఖ నటులు నిర్మాత దర్శకులు, పద్మాలయ స్టూడియో అధినేత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా సత్తెనపల్లి పట్టణంలోని కళాకారులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆదివారం స్థానిక కార్తీక్ రెసిడెన్సి లో జరిగిన ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి కళాకారులు హాజరయ్యారు. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ అభిమాని ఎస్.కె సుభాని పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ మా అసోసియేషన్ ట్రెజరర్ గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కృష్ణ తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడని అన్నారు. సినీ కళాకారులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వల్లెం లక్ష్మీ చెన్నకేశవరావు మాట్లాడుతూ 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయన్నారు.ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది పులహరి మధుసూదన రావు, ఏ టి యు సి నాయకులు కంబాల శ్రీనివాస్, ఆయుర్వేద వైద్యులు రాయపూడి శివ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

See also  కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సత్తెనపల్లి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి