నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు

నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు

           నెల్లూరు టౌన్ పరిధిలోని ఏసీ నగర్ లో దండరామపురం మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు జనసేన పార్టీ తరపున పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో న్యూ నెల్లూరు హాస్పిటల్ అధినేత డాక్టర్ P.బాలకోటశ్వరరావు మరియు డాక్టర్ వేణుగోపాల్ డెంటల్ గార్లచే జనరల్ మెడిసిన్ మరియు పంటి సమస్యలను పరీక్షలు జరిపి 200మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కల్యాణ్ గారి జనసేవ సూచనల మేరకు నగరంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. నగరంలో అనారోగ్య సమస్యలు పెల్లుబికుతున్న వేళ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం జనసేన పార్టీ తరుపున క్యాంప్ నిర్వహించామన్నారు. డాక్టర్స్ మాట్లాడుతూ జనసేనాని అడుగుల్లో జనసేన నాయకులు నడవడం ఆనందదాయకం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పత్తిరాము, మేడిశెట్టి గణేష్, Ch.రమేష్ బాబు, జనసేన ప్రసాద్, అరవ మణి మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.

 

See also  డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రాన్ని అందించిన జనసేన నాయకులు