ఘనంగా ప్రారంభమైన ఓపీఎల్ సీజన్-7 క్రికెట్ టోర్నమెంట్

విశాఖపట్నం, మే 20 (జనస్వరం) : “మద్యం వద్దు… మైదానం ముద్దు” అనే సందేశంతో ఓజీపీటీ కింగ్ మేకర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఓపీఎల్ (ఓల్డ్ గోపాలపట్నం ప్రీమియర్ లీగ్) సీజన్-7 క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది కూడా పరదేశమ్మ తల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు, 91వ వార్డు అధ్యక్షులు సంగం నరేంద్ర హాజరై టోర్నమెంట్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు ఆకర్షితులై ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టోర్నమెంట్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీ యజమానులు పాల్గొని ఆటగాళ్లను వేలం ద్వారా ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యువతలో స్నేహభావం, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. జూన్ 6, 7 తేదీల్లో మ్యాచ్‌లు ఉత్సాహభరితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ విజేతలకు అమ్మవారి పండుగ రోజు ఘనంగా బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

See also  ఆశా వర్కర్లను హౌస్ అరెస్ట్ చేసిన గ్రామీణ పోలీసులు