
– పెనుకొండ జట్టుకు రన్నర్స్ ఘనత
– యువ క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలి కే. గోపీనాథ్
తిరుపతి, ఏప్రిల్ 22, (జనస్వరం) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్‌లు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలు తిరుపతి జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం వేదికగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ హాజరయ్యారు. టిటిడి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంత కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కే. గోపీనాథ్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పెనుకొండ జట్టు రన్నర్స్‌గా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల యువత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతూ, క్రీడాకారులు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వాలీబాల్ జట్టు అద్భుత ప్రదర్శనతో రన్నర్స్‌గా నిలిచి ప్రతిభ చాటుకుందని. జట్టులో హరి, అశోక్, సారయ్, మౌళి, సాయి, శివ, వెంకటేష్, తేజ, సురేష్, కృష్ణారెడ్డి, రమేష్ వంటి క్రీడాకారులు సమన్వయంతో ఆడి జట్టుకు విజయాన్ని అందించారని తెలిపార








