జనసేనలోకి గుంతకల్ నియోజకవర్గ మహిళల భారీ చేరిక

 

అనంతపురం, ఏప్రిల్ 5 (జనస్వరం) : గుంతకల్ నియోజకవర్గం నుంచి పలువురు మహిళలు జనసేన పార్టీలోకి భారీగా చేరారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ టి.సి. వరుణ్ సమక్షంలో, గుంతకల్ నియోజకవర్గ ఇంచార్జ్ వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. గుత్తి ప్రాంతానికి చెందిన ఎం. రాజేశ్వరి సహా పలువురు మహిళలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, కూటమి ప్రభుత్వ విధానాలు, ఉప ముఖ్యమంత్రి పనితీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రోటోకాల్‌ను పాటించాలని సూచించారు. నూతనంగా పార్టీలో చేరిన మహిళలకు నాయకులు అన్నివేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణం, మండల నాయకులు, అనంతపురం నగర అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోండి - మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్