గంగాలమ్మవారిని దర్శించుకున్న ముదునూరి

పత్తిపాడు, మార్చి 29 (జనస్వరం) : పత్తిపాడు మండలం గిరిజన వంతాడ గ్రామంలో గంగాలమ్మ అమ్మవారిని, సీతారాములవారిని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎంపీపీ గోళ్ళ కాంతి సుధాకర్, మండల యూత్ వింగ్ అధ్యక్షుడు చందక నాని, గోనగల అజయ్, వైఎస్సార్సీపీ నాయకులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

See also  కొత్తచెరువు జనసేనపార్టీ కార్యలయంలో జనస్వరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం