
అనంతపురం, మార్చి 17, (జనస్వరం) : రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) సంస్థకు FCRA రెన్యూవల్ మంజూరు కావడంతో మాదిగ సంక్షేమ సేవా సంఘం (MSSS) రాష్ట్ర అధ్యక్షులు సాకే రామతీర్థ, జిల్లా అధ్యక్షులు మన్నల సుబ్రమణ్యం తదితరులు ఆర్డీటీ మాంచో ఫెర్రర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన భార్య విశాల్ ఫెర్రర్ కూడా పాల్గొన్నారు. నాయకులు వారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ RDT సంస్థ ఎన్నో సంవత్సరాలుగా జిల్లాలో పేదలు, రైతులు, మహిళలు, దివ్యాంగులు, విద్యార్థులకు చేస్తున్న సేవలు అపూర్వమని కొనియాడారు. FCRA రెన్యూవల్ ద్వారా సంస్థ సేవలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో వేలాది కుటుంబాలకు RDT ఆధారం కాగా, ఈ నిర్ణయం వారికి కొత్త ఆశలను నింపిందన్నారు. భవిష్యత్తులో కూడా సంస్థ మరింత సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కోటంక మల్లేష్, సి. నాగరాజు, సి. శంకరయ్య, చంటి, రానా ప్రతాప్ పాల్గొన్నారు.








