
నెల్లూరు, మార్చి 3, (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో పారా అథ్లెట్స్ కుటుంబాలకు అండగా నిలుస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40 మంది పారా అథ్లెట్స్ కుటుంబ సభ్యులు జనసేన ఉద్యమి సభ్యత్వం పొందారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచి వారికి ధైర్యం ఇవ్వడం జనసేన పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల తెలిపారు. పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టేట్ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చేసి నెల్లూరు జట్టుకు బంగారు పతకం అందించిన క్రీడాకారుడు పెంచలయ్యను ఘనంగా సత్కరించారు. ఆయన సాధించిన విజయాన్ని అభినందిస్తూ శాలువాలు కప్పి సర్టిఫికెట్లు అందజేశారు. గతంలో జనసేన పార్టీ తరఫున అందించిన క్రీడా పరికరాలు క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. సింగపూర్‌కు చెందిన నాగలక్ష్మి సేవా స్పూర్తితో కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పారా అథ్లెట్స్ కుటుంబాలకు నైతిక బలం అందించడమే కాకుండా సామాజిక బాధ్యతను చాటిచెప్పిందని నాయకులు పేర్కొన్నారు.








