
నెల్లిమర్ల, మార్చి 3, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పూసపాటిరేగ మండలం కందివలస గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం ప్రజా ప్రతినిధుల ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత వేగం తీసుకురాగలమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








